దళిత ఓటర్లకు గాలం

Mon, 4 Jul 2016, IST    vv
దళిత ఓటర్లకు గాలం

న్యూఢిల్లీ :

కేంద్ర మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి విస్తరణలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఎక్కువ మంది దళితులకు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. దళిత ఓటర్లకు వలవేసేందుకే ఎక్కువ మంది దళితులను మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొంత మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఇలాంటి వారిలో రేప్‌ కేసు నిందితుడు రసాయనాల, ఎరువుల శాఖ సహాయ మంత్రి నిహల్‌చంద్‌ మేఫ్‌ువాల్‌ , విజరు సంప్లా, నజ్మా హెప్తుల్లా, కల్‌రాజ ్‌మిశ్రా, సిద్దేశ్వర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో పదవులు ఆశిస్తున్న, పదవులు వచ్చే అవకాశం ఉన్న పలువురు సమావేశమై చర్చలు జరిపారు. మంత్రి వర్గంలో చేర్చుకునే అవకాశం ఉన్న పేర్లలో ఓబీసీ లోక్‌సభ సభ్యుడు అనుప్రియా పటేల్‌ (అప్నా దళ్‌), ఎస్‌ఎస్‌ అహ్లూవా లియా, విజరు గోయెల్‌, దళిత్‌ ఎంపీ పీపీ చౌదరి (రాజస్థాన్‌) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, ఉత్తరాఖండ్‌ నుంచి దళిత ఎంపీ అజరు తంతా, పురుషోత్తం రూపలా (గుజరాత్‌), రాందాస్‌ అత్వాలే (మహారాష్ట్ర ఆర్‌పీఐ ఎంపీ), మహేంద్రనాథ్‌ పాండే (యూపీ), కృష్ణరాజ్‌ (దళిత ఎంపీ-యూపీ) పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రముఖ మంత్రులెవరినీ కదిలించబోరని అయితే, కొంతమంది సహాయ మంత్రులకు స్థానచలనం కలుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. మంత్రివర్గ విస్తరణను ధృవీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి ఫ్రాంక్‌ నోరన్హ ట్వీట్‌ చేశారు. గత కొన్ని వారాలుగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

క్రీడల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్‌ అసోం ముఖ్యమంత్రి కావటంతో ఆ పదవి ఖాళీగా ఉంది. నరేంద్ర మోడీ ప్రధానిగా 2014 మే నెలలో పదవిని చేపట్టిన తరువాత మంత్రివర్గ విస్తరణ జరగటం ఇది రెండోసారి. ప్రధానితో సహా ప్రస్తుతం 64 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం 82 మంది మంత్రులు ఉండవచ్చు. దిబ్రూఘర్‌ నుంచి మొదటిసారిగా ఎన్నికైన రామేశ్వర్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత రమెన్‌ దేఖా, బీజేపీ ఎంపీలు మహేంద్ర పాండే, కృష్ణరాజ్‌, మాజీ జర్నలిస్టు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఎంజే అక్బర్‌, మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్‌ కోషియారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.


Share Email Print

జిల్లా వార్తలు

తాజావార్తలు లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు