పన్ను చెల్లింపులు 4 శాతమే!

Sat, 30 Apr 2016, IST    vv
పన్ను చెల్లింపులు 4 శాతమే!

న్యూఢిల్లీ : దేశంలో పన్ను చెల్లింపులు కేవలం నాలుగు శాతం మాత్రమేనని, పన్ను ఎగవేత దారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారని ప్రభుత్వ తాజా నివేదికలు వెల్లడించాయి. దేశ జనాభా వంద కోట్లకు పైగా ఉన్నా వారిలో ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య కేవలం మూడున్నర కోట్లు కూడ మించడం లేదన్న విషయాన్ని ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి. పెద్దమొత్తంలో సంపాదించే వారు కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించకపో వడంతో పన్ను చెల్లింపులు ఏమాత్రం పెరగడంలేదని లెక్కలు చెప్తున్నాయి. నెలసరి ఆదాయం 21 వేల రూపాయలు దాటితే ఆ వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లింపు పరిథిలోకి వస్తాడు. దేశంలో సంవత్సరానికి కోటి రూపాయలు మించి ఆదాయం ఉన్నవారు అధికంగానే ఉన్నా చెల్లింపులు మాత్రం నాలుగు శాతానికి మించడం లేదని ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపులు దాఖలు చేసిన భారతీయులు కేవలం 4 శాతమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వార్షిక ఆదాయం పది లక్షలకు మించి ఉన్నవారు అధికంగానే ఉన్నా... పన్ను చెల్లింపుల విషయంలో మాత్రం పది లక్షల మంది కూడా కనిపించడం లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం మించి ఉన్నవారిలో పన్ను చెల్లింపులు దాఖలు చేసినవారు 20,000కు లోపుగానే ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.


Share Email Print

జిల్లా వార్తలు

బిజినెస్ లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు