'మే డే' స్ఫూర్తితో మరో మహోజ్వల పోరాటం!

Sat, 30 Apr 2016, IST    vv
'మే డే' స్ఫూర్తితో మరో మహోజ్వల పోరాటం!

'' మే డే '' పేరు చెప్పగానే ప్రపంచ వ్యాపితంగా శ్రామికవర్గ పోరాట స్ఫూర్తి స్పురణకు వస్తుంది. యావత్తు ప్రపంచ శ్రామిక వర్గం ఒక సైన్యంలా ఒకే పతాకం క్రింద తమ హక్కుల సాధనకు పోరాడే సంకల్పాన్ని మే డే కల్గిస్తున్నది. మే డే పేరు చెప్పగానే 8 గంటల పనిదినం కోసం జరిగిన ఉద్యమాల నేపధ్యం గుర్తుకురాక తప్పదు. దీంతో పాటు అంతర్జాతీయ కార్మికవర్గ సంఘీభావం, సామ్రాజ్యవాద, వలసవాదుల యుద్ధ వ్యతిరేక భావన కార్మిక వర్గానికి గుర్తుకు వస్తుంది. కార్మికవర్గ రాజకీయ, ఆర్థిక హక్కు లతో పాటు ప్రపంచ శ్రామికులందరూ ఏకమై ఉన్నారన్న విష యాన్ని వివిధ దేశాల పెట్టుబడీదారులకు, కార్మికవర్గ వ్యతిరేకు లకు తెలియజేస్తుంది. మానవాళి మహోజ్వల భవిష్యత్‌ కొరకు, సుస్థిర శాంతి స్థాపనకు పోరాడుతున్న ప్రపంచ శ్రామికులందరూ మే దినోత్సవం రోజున తమ అంతర్జాతీయ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేస్తారు. ఈ స్ఫూర్తితోనే గత 126 ఏళ్ళుగా ప్రపంచ వ్యాపితంగా మే డే పీడిత, తాడిత శ్రామిక జనా వళికి పోరాడే శక్తిని కలిగిస్తున్నది. 18వ శతాబ్ధంలో ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా పెట్టుబడిదారీ వర్గం అభి వృద్ది చెంది నూతన పరిశ్రమలు ప్రపంచ వ్యాపితంగా ఆవిర్భ వించిన ఫలితంగా పెట్టుబడిదారీ దోపిడీ పై సమర శంఖం పూరి స్తూ 18వ శతాబ్ధంలో యూరప్‌ఖండంలో పారిశ్రామిక కార్మికవర్గ ఆవిర్భావం జరిగింది. 19వ శతాబ్ధం ఆరంభంలో ప్రపంచ వ్యాపితంగా యూరప్‌, అమెరికా ఖండాలలో కార్మికులను 14 నుండి 18 గంటల వరకు యజమానులు అమానుషంగా పని చేయించే వారు. సూర్యోదయం కాకముందు నుండి సూర్యాస్త మయం తర్వాత కూడా పనిచేసే నిర్భంధ పని విధానం అమలు జరిగింది. కటిక చీకటిలో, మురికి కూపాలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు, గాలి, వెలుతురు లేని పరిస్థితుల్లో చాలీచాలని వేతనాలతో కార్మికవర్గం యాజమాన్యానికి కట్టుబానిసలవలే జీవిం చవలసి వచ్చింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెట్టుబడి దారీ దేశాలలో కార్మికవర్గం పోరాటాలను ప్రారంభిం చింది. తొలిరోజులలో 10 గంటల పనిదినాల కోసం అనేక పారిశ్రామిక వాడల్లో ఆందోళనలు ప్రారంభమైనాయి. 1827లో ఇంగ్లండ్‌లోని ఫిలడల్ఫియాలో మెకానిక్స్‌ యూనియన్‌ నాయ కత్వాన తొలి కార్మిక సమ్మె 10 గంటల పనిదినాలను డిమాండ్‌ చేస్తూ జరిగింది. 1834లో అమెరికాలోని న్యూయార్క్‌లో రోజుకు 18 గంటల నుండి 20 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మి కులు ఆందోళనలు చేశారు. నాటి నుండి అనేక దేశాలు, పట్ట ణాల్లో 10 గంటల పనిదినం కోరుతూ కార్మికులు పెద్దఎత్తున ఆందో ళనలు నిర్వహించారు. 1837లో కార్మికుల ఆందోళనకు తలొగ్గిన అమెరికా ఫెడరల్‌ గవర్నమెంట్‌ 10 గంటల పని విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. అనంతరం 1856లో బిల్డింగ్‌ ట్రేడ్‌ వర్కర్స్‌ (ఆస్టేలియా) 8 గంటల పని, 8 గంటల రిక్రియేషన్‌, 8 గంటల విశ్రాంతి నినాదంతో ఉద్యమించి 8 గంటల పనివిధానాన్ని సాధించేందుకు ఉద్యమం నిర్వహించింది. 1866లో అమెరికాలోని బాల్టిమోర్‌లో 60 కార్మిక సంఘాల ప్రతినిధులు నేషనల్‌ లేబర్‌ యూనియన్‌ పేరుతో ఒక సంఘాన్ని స్థాపించారు. దీనికి విలియం హెచ్‌ సెల్విస్‌ నాయకత్వం వహించారు. ఈయన లండన్‌లోని ఫస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకుని 8 గంటల పని కోసం ఆందోళన నిర్వహించారు. 1886లో అమెరికా నగరాల్లో 11,562 పరిశ్ర మల్లో పనిగంటల తగ్గింపు డిమాండ్‌తో సమ్మెలు జరిగాయి. లక్షలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. 1886 మే 1వ తేదీ చికాగో నగరం కేంద్రంగా 8 గంటల పనిదినం కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది. చికాగోతో పాటు న్యూయార్క్‌, బాల్టిమోర్‌, వాషింగ్‌టన్‌, మిల్‌వాకి, సిన్‌సినాటి, సెంట్‌లూయీస్‌, ఫిట్స్‌బర్గ్‌, డెట్రాయిట్‌ మొదలైన నగరాల్లో కూడా సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో 5 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు.

- చలసాని వెంకట రామారావు,

అధ్యక్షులు ఎ.ఐ.టి.యు.సి ఎ.పి. రాష్ట్ర సమితి


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు