మా గురించి

విశాలాంధ్ర1952 జూన్‌ 22న ఆవిర్భవించింది.దీని మాతృక విశాలాంధ్ర విజ్ఞాన సమితి. విశాలాంధ్ర దినపత్రిక, విశాలాంధ్ర ప్రచురణాలయం, విశాలాంధ్ర బుక్‌ హౌస్‌లను విశాలాంధ్ర విజ్ఞానసమితి నిర్వహిస్తున్నది. తెలుగు నెలపై ప్రారంభమైన, స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి తెలుగు దినపత్రిక విశాలాంధ్ర.

విజయవాడ నుండి ప్రారంభమైన విశాలాంధ్ర దిన పత్రిక1970వ దశకం పూర్వర్ధంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఆర్ధిక భారం వల్ల కొద్దికాలానికే హైదరాబాద్‌ ఎడిషన్‌ మూతపడింది. పాఠకులకు అందుబాటులో తాజా వార్తలతో పత్రికను వెలువరించాలన్న ఏకైక లక్ష్యంతో ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం, కరీంనగర్‌, కర్నూల నుండి ప్రచురణలు ప్రారంభమయ్యాయి. మరి కొన్ని కేంద్రాలకు కూడా విశాలాంధ్ర ప్రచురణను విస్తరించాలని, సాధ్యమైనంత త్వరలో ఖమ్మం నుండి ప్రారంభించాలని విశాలాంధ్ర విజ్ఞాన సమితి నిర్ణయించింది. దాదాపు అన్ని జిల్లా కేంద్రాలలో పిసి సెంటర్లు, కొన్ని డివిజన్‌ కేంద్రాలలో సబ్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. జిల్లా కేంద్ర విలేకరులతో పాటు మున్సిపల్‌, మండల స్థాయిలో వెయ్యికి పైగా వార్తహారుల వ్యవస్థతో న్యూస్‌ నెట్‌వర్క్‌ నెలకొన్నది. విజయవాడ ప్రధాన కార్యాలయంగా విశాలాంధ్ర వెలువడుతుంది.

   ఈ సంస్థ ఏ వ్యక్తికో, వ్యక్తులకో చెందిన వ్యక్తిగత లేదా పబ్లిక్‌, ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల లాంటి సంస్థ కాదు. సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం (Act XXI of 1960) కింద విశాలాంధ్ర విజ్ఞాన సమితి (S.No. 44 of 1956) కృష్ణా జిల్లా కేంద్రమైన మసులీపట్నంలో 27.12.1956న రిజిస్ట్రర్‌ అయింది. విశాలాంధ్రకు యాజమాని విశాలాంధ్ర విజ్ఞాన సంస్థ. సహాకార చట్టం కింద ఏర్పడిన సంస్థ ద్వారా దిన పత్రికను నిర్వహించటం ఒక అరుదైన ప్రయోగం. రాష్ట్రంలో ఇలాంటి సంస్థ ద్వారా ప్రచురితమవుతున్న తొలి తెలుగు దిన పత్రిక విశాలాంధ్ర. దీని లాభానష్టాలన్ని ప్రజలవి, పాఠకులవి.లాభాలు వస్తే పాఠకులకు పత్రిక మరింత చేరువ కావటానికి అనువుగా, వైవిధ్యమైన శీర్షికలతో మరింత ఆకర్షణీయంగా తాజా వార్తలతో అందించటానికి అవసరమైన సాంకేతిక సదుపాయాలను సమకూర్చటం, విస్తరణకు వినియోగించటం, నష్టాలు వాటిల్లినప్పుడు ప్రజలను, పాఠకులను, శ్రేయోభిలాషులను ఆర్ధించటం ఒక్కటే దీని మార్గం. లాభార్జనే విశాలాంధ్ర ధ్యేయం కాదు. అది ఎంపిక చేసుకున్న సమసమాజ లక్ష్య సాధనే దానికి ప్రధానం. అంతకన్న వేరే స్వార్థం లేదు.

   57 ఏళ్ళు (2009) గడిచిన విశాలాంధ్ర మహా ప్రస్థానంలో... ప్రజల, పాఠకుల సమాధారణ, అభిమానుల అండదండలు , ఆశయ బలం, సంకల్ప సిద్ధి, ఈ పత్రిక నిరాఘాటంగా వెలువడటానికి కారణ భూతాలు. ఆశయ సాధనలో విశాలాంధ్ర పత్రిక సాధించినది తెలుగు పత్రిక రంగానికే తలమానికం. అయినా సాధించవలసినది ఎంతో ఉన్నదనేది సత్యం. ఉద్యమాలకు, తెలుగుజాతి పోరాటాల చరిత్రకు విశాలాంధ్ర ప్రతీక. ఇది శ్రమజీవుల వాణి. ప్రజల ప్రయోజనాలకు విఘాతం ఎటు నుండి తలెత్తినా విశాలాంధ్ర హెచ్చరిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. వారు నిర్వహిస్తున్న పోరాటాలకు ఆలంభనగా నిలబడుతుంది. స్వాతంత్రోద్యమ సాంప్రదాయాలు, విలువల స్ఫూర్తితో దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే పవిత్ర కర్తవ్యంలో విశాలాంధ్ర ముందుంటుంది. నిజాన్ని నిర్భయంగా విశాలాంధ్ర వెల్లడిస్తుంది. సత్యం కొరకు అది పోరాడుతుంది. సమాచార విజ్ఞానాన్ని అందించడం దాని పవిత్ర కర్తవ్యంగా ఎంచుకుంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యస్థాపన ఆవశ్యకతను అది పునరుద్ఘాటిస్తున్నది. పురోగామి శక్తులతో అది గొంతు కలుపుతుంది.

   విశాలాంధ్ర సంపాదకులుగా ఈడ్పుగంటి నాగేశ్వరరావు (విజయవాడ), ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఎం. సుబ్బారావు (విజయవాడ), రెసిడెంట్‌ ఎడిటర్‌గా కె. శ్రీనివాస్‌రెడ్డి (హైదరాబాద్‌) పనిచేస్తున్నారు. విశాలాంధ్ర విజ్ఞానసమితి జనరల్‌ మేనేజర్‌గా వై. చెంచయ్య (విజయవాడ) వ్యవహరిస్తున్నారు.

   విశాలాంధ్ర విజ్ఞానసమితి పాలకమండలి (గవర్నింగ్‌బాడీ)లో 11మంది సభ్యులుగా ఉంటారు. పాలకమండలిని సర్వసభ్య సమావేశం (జనరల్‌బాడీ) ఎన్నుకుంటుంది.

   విశాలాంధ్ర విజ్ఞానసమితిని 27.12.1956లో ఈ క్రింది వారు రిజిస్ట్రర్‌ చేసిన వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

1. నీలం రాజశేఖర్‌రెడ్డి (అనంతపురం), 2. మోటూరి హన్మంతరావు (విజయవాడ -2), 3. కాట్రగడ్డ రాజగోపాల్‌రావు (విజయవాడ -2), 4. పొన్నం వీరరాఘవయ్య (అడ్వకేట్‌, విజయవాడ-2), 5. వీరమాచనేని ప్రసాదరావు (హైదరాబాద్‌), 6. రాజ్‌బహుదూర్‌ గౌర్‌ (హైదరాబాద్‌), 7. బద్దం ఎల్లారెడ్డి (హైదరాబాద్‌)


విశాలాంధ్ర విజ్ఞానసమితి పాలకమండలి
(గవర్నింగ్‌బాడీ)

పాలకమండలి సభ్యులు:

1. చాడ వెంకటరెడ్డి, అధ్యక్షులు, 2. బిఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి, కార్యదర్శి, 3. డా|| వి.రాంప్రసాద్‌, కోశాధికారి, 4. డా|| కె. నారాయణ, సభ్యులు, 5. ఈడ్పుగంటి నాగేశ్వరరావు, సభ్యులు, 6. కె. సుబ్బరాజు, సభ్యులు, 7. కె.శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు, 8. జి.వి. సత్యనారాయణమూర్తి (నాని), సభ్యులు, 9. పి. హరినాథరెడ్డి, సభ్యులు, 10. సిద్ది వెంకటేశ్వర్లు, సభ్యులు, 11. వై. చెంచయ్య, సభ్యులు, 12. పువ్వాడ నాగేశ్వరరావు, ఆహ్వానితులు, 13. బి. ప్రభాకర్‌, న్యాయసలహాదారు, ఆహ్వానితులు

 • చాడ వెంకటరెడ్డి, అధ్యక్షులు

 • బిఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి, కార్యదర్శి

 • డా|| వి.రాంప్రసాద్‌, కోశాధికారి

 • డా|| కె. నారాయణ, సభ్యులు

 • ఈడ్పుగంటి నాగేశ్వరరావు, సభ్యులు

 • కె. సుబ్బరాజు, సభ్యులు

 • కె.శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు

 • జి.వి. సత్యనారాయణమూర్తి (నాని), సభ్యులు

 • పి. హరినాథరెడ్డి, సభ్యులు

 • సిద్ది వెంకటేశ్వర్లు, సభ్యులు

 • వై. చెంచయ్య, సభ్యులు

 • పువ్వాడ నాగేశ్వరరావు, ఆహ్వానితులు

 • బి. ప్రభాకర్‌, న్యాయసలహాదారు, ఆహ్వానితులు

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు