రాజా కథానాయకుడిగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో 'జగన్నాయకుడు' చిత్రం ప్రారంభం

Thu, 13 Feb 2014, IST    vv

రాజా కథానాయకుడిగా, మమతా రాహుల్‌, శిరీష కథానాయికలుగా సీనియర్‌ దర్శకుడు పి.చంద్రశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో విజయాంజనేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న 'జగన్నాయకుడు' చిత్రం షఉటింగ్‌ బుధవారంనాడు నెల్లూరుజిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రారంభమైంది. హీరో రాజా, హీరోయిన్‌ మమతా రాహుల్‌పై ''కన్నులలోన వెన్నెలనీవై కవ్వించావు'' అనే పాట చిత్రీకరణతో షఉటింగ్‌ను మొదలుపెట్టారు. దీనికి పల్లం కళాధర్‌ నృత్యరీతులను సమ కూరుస్తున్నారు. దీనికి ఆ కళాశాల అడ్మినిస్ట్రేట్‌ ఆఫీసర్‌ జె.రామయ్య క్లాప్‌ ఇవ్వగా, ప్రముఖ వ్యాపారవేత్త కూరపాటి శంకరరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, 'నేను గతంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'భోగభాగ్యాలు' చిత్రాన్ని నిర్మించాను. ఆ రోజుల్లో ఆ చిత్రం వందరోజులు ఆడింది.దానికి కూడా పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆయన దర్శకత్వంలోనే చిత్రం తీస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం షఉటింగ్‌ను 30రోజులపాటు గూడూరు పరిసరాల్లోని బద్వేలు, వెంకన్నపాలెం, పీడూరుపాలెం, మామోది తదితర గ్రామాల్లో జరుపుతాం. ఇప్పటికే ఆరు పాటల రికార్డింగ్‌ను పూర్తిచేశాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం' అని చెప్పారు. దర్శకుడు పి.సి.రెడ్డి మాట్లాడుతూ, 'మూడు తరాల కథ ఇది. తాత, తండ్రి, కొడుకు పాత్రలు ప్రధానంగా ఉంటాయి. ఇందులో తాతగాను, గ్రామపెద్ద పాత్రలోనూ రంగనాథ్‌ నటిస్తున్నారు. ఇక తండ్రి పాత్రలోను, పేదల అభ్యున్నతికి పాటుపడే డాక్టర్‌గానూ... ఆ తర్వాత ఎం.ఎల్‌.ఎగా మారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే పాత్రను భానుచందర్‌ పోషిస్తున్నారు. కొడుకు పాత్రలో కథానాయకుడు రాజా నటిస్తున్నారు.

వ్యాపారవేత్తగా పేరుపొంది, ఆ తర్వాత తన తండ్రిలాగే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకునేవిధంగా రాజా పాత్ర మలచబడింది' అని చెప్పారు. కాగా కథాబలం కలిగిన ఓ మంచి చిత్రంలో మంచి పాత్రలను పోషిస్తున్నందుకు ఆనందంగా ఉందని హీరో రాజా, హీరోయిన్‌ మమతారాహుల్‌ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో ఆమని, ఎం.ఎస్‌.నారాయణ, రఘుబాబు, చంద్రమోహన్‌, రంగనాథ్‌, అన్నపూర్ణ తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి మాటలు : సింగప్రసాద్‌, పాటలు : తైదలబాపు, వీరేంద్ర కాపర్తి, ప్రవీణ, వి.ఎ.పద్మనాభరెడ్డి, కెమెరా : నాగశ్రీనివాసరెడ్డి, సంగీతం : ప్రమోద్‌కుమార్‌, స్టిల్స్‌ : కె.వై.గిరిరాజ్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : లక్ష్మణ్‌రావు, కో-డైరెక్టర్‌ : కె.సూర్యనారాయణ, కథ, నిర్మాత.పద్మనాభరెడ్డి, స్క్రీన్‌ప్లే : దర్శకత్వం : పి.చంద్రశేఖరరెడ్డి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు