'శభాష్‌ నాయుడు'గా కమల్‌

Sat, 30 Apr 2016, IST    vv
'శభాష్‌ నాయుడు'గా కమల్‌

వైవిధ్యభరిత చిత్రాలకు మారు పేరుగా నిలిచే విశ్వనటుడు కమల్‌ హాసన్‌ త్వరలో 'శభాష్‌ నాయుడు'గా రానున్నారు. ఏక కాలంలో మూడు భాషలలో నిర్మాణం కానున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలో జరిగింది. తమిళం, తెలుగు భాషలలో శభాష్‌ నాయుడు గాను, హిందీలో 'శభాష్‌ కుండు'గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమలహాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై నిర్మించి, కథా నాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో లైకా ప్రొడక్షన్‌ సంస్థ భాగస్వామ్యం కావడం విశేషం. దీనికి ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా చిత్రానికి తమిళ టైటిల్‌తో పాటు సంగీతాన్ని అందిస్తున్నారు. కమల్‌.. కుమార్తె శ్రుతిహాసన్‌తో కలిసి నటిస్తున్న తొలిచిత్రం ఇది. రమ్యకృష్ణ,బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించనున్నాను.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు