సందడిగా బిపాసా సంగీత్‌ వేడుక

Sat, 30 Apr 2016, IST    vv
సందడిగా బిపాసా సంగీత్‌ వేడుక

బాలీవుడ్‌ నటి బిపాసా బసు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ ఒక్కటి కానున్నారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం బిపాసా... కరణ్‌ను పెళ్లాడనుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన సంగీత్‌లో బిపాసా, కరణ్‌లు వేదికపై డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ఈ వేడుకలో తీసిన కొన్ని ఫొటోలను కరణ్‌, బిపాసా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు. సంగీత్‌లో బిపాసా లేత గులాబి రంగు లెహంగాలో మెరిసింది. వివాహ అనంతరం సాయంత్రం ముంబయిలో వీరి వివాహ రిసెప్షన్‌ను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి బాలీవుడ్‌ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు