బక్కారెడ్డి మృతికి సిపిఐ సంతాపం

Tue, 18 May 2010, IST    vv

నల్లగొండ రూరల్‌/భువనగిరి (వి.వి) : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొణతం బక్కారెడ్డి (65) మృతి పట్ల సిపిఐ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. సిసిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమావత్‌ రవీంద్ర కుమార్‌, రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, సహయ కార్యదర్శి గోద శ్రీరాములు , గులాం రసూల్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గడ్డ మీది పాండరి, మునుగోడు ఎమ్యేల్యే ఉజ్జిని యాదగిరిరావు, మాజీ ఎమ్యేల్యే గుర్రం యాదగిరిరెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల దామోదర్‌ రెడ్డి, ఆర్‌ .ఆచారి, ఎల్‌. శ్రావణ్‌ కుమార్‌, లోడి చంద్రయ్య, నెల్లి కంటి సత్యం, గీతపనివారం సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు వీర స్వామి, గుండాల, ఆత్మకూర్‌ ఎం మండల కార్యదర్శులు హరిశ్చంద్ర, వెంకట్‌రాం రెడ్డి, సంతాపం తెలిపారు.ఆయన ఆంత్యక్రియలలో పాల్గొని శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆంత్యక్రియలు మోత్కూర్‌లోమంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో సిపిఐ నాయకులు ప్రసంగించారు. ఆయన పార్టీకి చేసిన సేవలు కొనియాడారు. ఆయన లేని లోటు పార్టీకి తీరనిదని పేర్కొన్నారు. ఈ అంత్య క్రియలలో స్థానిక నాయకులు కంచర్ల రామ కృష్ణారెడ్డి, మందడి కృష్ణారెడ్డి, ఎంపిపి సుష్పలత, రైతు సంఘ నాయకులు యామగాని గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఉజ్జిని రత్నాకర్‌ రావు , కార్యవర్గ సభ్యులు యానాల దామోదర్‌ రెడ్డి, భువనగిరి మండల కార్యదర్శి ఏశాల అశోక్‌ , నాయకులు ముదిగొండ రాములు, ఉడుత రాఘవులు, మేడబోయిన ఎట్టయ్య, తీవ్ర సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్కారెడ్డి జిల్లా యువజన సమాఖ్యలో పనిచేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీలో నిరంతరం ప్రజల సమస్యలకు ఎంతగానో కృషి చేశారని 30 సంవత్సరాలుగా సిపిఐలో కీలక పాత్ర పోషిస్తూ జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేశారని తెలిపారు. మోత్కూర్‌ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. అదే విధంగా మోత్కూర్‌లో సిపిఐ కార్యాలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. సంతాపం తెలియజేసిన వారిలో సిపిఐ కార్యవర్గ సభ్యులు ఆర్‌.ఆచారి, కలకొండ కాంతయ్య, పబ్బు వీరస్వామి, శ్రావణ్‌ కుమార్‌, జిల్లా పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షులు నెల్లికంటి సత్యం, సిపిఐ పట్టణ కార్యదర్శి ఐతరాజు శంకర్‌, ఖాదర్‌ తదితరులున్నారు.

కొణతం బక్కారెడ్డి పాత రామన్న పేట శాసన సభ నియోజక వర్గం మోత్కూర్‌ ప్రాంతానికి చెందిన వారు. చిన్న తనం నుండే కమ్యూనిస్టు పీర్టీ ఆశయాలకు ఆకర్శితుడై పార్టీలో చేరారు. శతాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీ పూర్తి సమయం కార్యకర్గగా నాయకునిగా పని చేస్తున్నారు. ఆయన రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు.కార్మికులు, కర్షకులు పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించి, పేద ప్రజల నాయకుడుగా వెలుగొందారు.పాత రామన్న పేట నియోజక వర్గంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం తుంగతుర్తి శాసన సభ నియోజక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. రామన్నపేట శాసన సభ నియోజక వర్గం నుండి సిపిఐ పార్టీ అభ్యర్థిగా ఎమ్యేల్యే పదవికి పోటీ చేశారు. ఘన నీయమైన ఓట్లు సంపాదించారు.పాత రామన్నపేట, తుంగతుర్తి శాసన సభ నియోజక వర్గాలలో ఆయన పర్యటించని గ్రామం లేదు. ఈ నియోజక వర్గాలలో ప్రజలందరూ ఆయనను ఎరుగుదురు.జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణ భ్యాద్యులలో ఒకరుగా పనిచేస్తూ రైతు సంఘం సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించారు. ఆయన సూర్తితో అనేక మంది యువకులు పార్టీలో చేరి పని చేస్తున్నారు. కూలీల సమస్యలు,రైతుల సమస్యలు, పేదులు, కార్మికుల సమస్యలపై ఆయన సాగించిన పోరాటం మరువ లేనిది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు