ఉద్యమమే ఊపిరిగా....

Tue, 18 May 2010, IST    vv

నల్లగొండ (వి.వి) : కొణతం రామచంద్రారెడ్డి, రామ చంద్రమ్మ దంపతులకు ఏకైక పుత్రుడు బక్కారెడ్డి 1968లో ద్వారాణాల యాదగిరి న్యాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1969లో ఈ ప్రాంతంలో జరిగిన జన సేవాదళ్‌ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందారు. 1970-71 అడ్డగూడూరులో పెద్దరేగడి భూ పోరాటంలో 560 ఎకరాల భూ పోరాటంలో పాల్గొన్నారు. కె.రామ చంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, సోలిపురం మల్లారెడ్డి తదితరులు అరెస్టై చెరసాల పాలయ్యాడు. 1970 నుండి 1980 వరకు ఏఐవైఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. సిపిఐలో యువజన విద్యార్ధి రంగాల సబ్‌ కమిటీ బాధ్యులుగా పనిచేస్తూ సొంత గ్రామమైన ఆరేగూడెంలో వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహించి అనేక మంది యువతీ యువకులను చైతన్య పర్చారు. రామన్నపేట తాలుకా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. మోత్కూర్‌ తాలుకాలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పనిచేశారు. 1970లో జరిగిన అధిక ధరలకు వ్యతిరేఖంగా ఒక రూపాయి కిలో బియ్యం పేద ప్రజలకు జొన్నలు పంపిణీ చేశారు. మండలాలు ఏర్పాటు చేసిన తరువాత మండల ప్రజా పరిషత్‌లో అధ్యక్షత స్థానానికి సిపిఐ అభ్యర్థిగా పనిచేశారు. గుంటూరులో జరిగిన సిపిఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికలు ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ఉద్యమానికి రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించి ప్రజలను చైతన్య పర్చారు. నాగార్జున రైతు సేవా సహాకార సంఘానికి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా రామన్నపేట నుండి పోటీ చేశారు. 1968లో సిపిఐలో చేరారు. 1969లో జనతా సేవాదళ్‌ శిక్షణా శిభిరాల్లో పాల్గొన్నారు. 1970-71లో అడ్డగూడురులో పెద్దరేగడి భూ పోరాటం చేసి పేదలకు పంచారు. 1985లో మండల అధ్యక్షులుగా పోటీ చేశారు. సివిల్‌ విండో చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రైతు సంఘం అధ్యక్షులుగా, ఆర్‌ ఆర్‌ స్మారక భవన్‌ కార్యదర్శిగా పనిచేస్తూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ షుగర్‌ వ్యాధితో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల నాయకులు హరిచంద్ర, వెంకటరాంరెడ్డి, సుదర్శన్‌, వెంకటేశ్‌, ఆవుల వెంకన్న, చింతపల్లి బయ్యన్న, నెల్లికంటి సత్యం, పబ్బు వీర స్వామి, ఎల్లావుల యాదగిరి, గోపాల్‌, సత్తయ్య, దాసు, అంజయ్య, పుల్లయ్య, వెంకట్‌, రచ్చ భారతి లు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతా పాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.

బక్కారెడ్డి మృతికి పువ్వాడ సంతాపం

రైతు సంఘం జిల్లా అధ్యక్షలు, సీనియర్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కొణతం బక్కారెడ్డి అకాల మృతికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పువ్వాడ నాగేశ్వర్‌రావు వారి మృతికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు