నిజజీవిత దర్పణం 'లక్ష్మీటాక్‌ షో'

Mon, 17 Sep 2012, IST    vv

ఈ రియాల్టీ షో ప్రస్తుతం ఉన్న అన్ని షోల మాదిరిగా కాదు. ఇక జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పంచుకుంటూ, పాఠాలుగా మలచుకుంటూ ఎదిగిన వైనాన్ని ఒక కాన్పెప్ట్‌గా తీసుకుని రియాల్టీ షోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. విలక్షణ నటుడు మోహన్‌బాబు కుమార్తె లకీë మంచు ఈ కార్య క్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. అసాధారణ, ఆసక్తికర సెలెబ్రిటీ కాంబినేషన్‌ల సంపూర్ణ అనుభవాలను తెలిపే ఓ సాధారణ, అసాధారణ వేదికలా ఉండే ఈ షోను లకీë టాక్‌ షోగా జీ తెలుగు టీవీలో ప్రతి శుక్రవారం 8.30 గంటలకు ప్రసారం చేస్తారు. ఒక రంగంలో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు సెలబ్రిటీల కాంబినేషన్‌ను ఈ సాధారణ వేదికపై ఆహ్వానించి విలువల్లో తేడాలు, అనుభవం, కెరీర్‌లో చేదు మరియు తీపి గురుతులు, నిజాలు, కారణాలు. జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలు వంటివి చర్చిస్తారు.అయితే ఈ షో.. సమస్యలు లేదా కొన్ని అంశాల పరిష్కారానికి మాత్రం కాదు. కానీ ఇందులో పాల్గొన్న సెలబ్రిటీల ప్రతి స్వంత అభిప్రాయాన్ని గౌరవించబడుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అభిమాన ప్రముఖులు, స్టార్‌ల గురించి తెలిసిన, తెలియని మరిన్ని ఎన్నో వివరాలు ఈ వైవిధ్య కార్యక్రమంలో తెలుస్తాయి. వడపోసిన జీవితపు విలువలను తెలపడంలోను ఈ కార్యక్రమం కీలక పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, నిస్సహాయతలు, ఛేదించిన లక్ష్యాలు, అనుకోని లాభాలు, అద్భుతాలు, విఫలాలు కూడా సెలబ్రిటీలు యాంకర్‌ లకీëతో పంచుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ కార్యక్రమం పాప్యులారిటీని సంతరించుకుంది. అశేష అభిమానులను కూడగట్టుకుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు