సీనియర్‌ జర్నలిస్టు పుల్లయ్య హఠాన్మరణం

Sun, 23 Oct 2016, IST    vv
సీనియర్‌ జర్నలిస్టు పుల్లయ్య హఠాన్మరణం

సీనియర్‌ జర్నలిస్టు పుల్లయ్య హఠాన్మరణం

విశాలాంధ్ర - విజయవాడ : సీనియర్‌ జర్నలిస్టు ఉదయగిరి పుల్లయ్య శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాత్తుగా మర ణించారు. ఆయన పాత్రికేయ జీవిత ప్రస్థానం విశాలాంధ్ర దినపత్రిక నుండి ప్రారంభ మైంది. 15 సంవత్సరాలపాటు సబ్‌ -ఎడిటర్‌గా, సినీ రిపోర్టర్‌గా విశా లాంధ్రలో పని చేశారు. 1983లో విశాలాంధ్ర పత్రిక తర ఫున ఆరు నెలల పాటు సోవియట్‌ యూనియన్‌లో పర్యటించారు. పుల్లయ్య ఆంధ్రప్రభ, కృష్ణా పత్రికల్లో కూడా సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. అనేక చిన్న పత్రికల్లో తాజా రాజకీయ, సామాజిక సమస్యలపై పలు వ్యాసాలు కూడా రాశారు.

ఏపీయూడబ్ల్యుజే అనుబంధ విజయవాడ ప్రెస్‌క్లబ్‌ కోశాధికారిగా పుల్లయ్య బాధ్యతలు నిర్వహించారు. యూనియన్‌ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. యూనియన్‌ కృష్ణా అర్బన్‌ యూనిట్‌ ప్రతి యేటా ప్రచురించే జర్నలిస్టుల డైరీ ముద్రణ బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకొని గత ఐదారేళ్ళుగా పుల్లయ్య చేసిన కృషి మరువలేనిది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. బంధువులు పుల్లయ్య మృతదేహాన్ని ఆయన స్వస్థలం కడపకు తరలించారు. శనివారం కడపలో పుల్లయ్య అంత్యక్రియలు జరిగాయి.

ముఖ్యమంత్రి సంతాపం

సీనియర్‌ పాత్రికేయుడు ఉదయగిరి పుల్లయ్య హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రికల్లో పని చేసి, విజయవాడ ప్రెస్‌క్లబ్‌ కోశాధికారిగా సేవలందించిన పుల్లయ్య అనేక సమాజిక అంశాలను స్పృశించారని కొనియాడారు. పుల్లయ్య లేని లోటు విజయవాడ పాత్రికేయ రంగానికి తీరనిదన్నారు. ఈ సందర్భంగా పుల్లయ్య మృతికి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజ

ఐజేయూ, ఏపీయూడబ్ల్యుజే సంతాపం

పుల్లయ్య మృతికి ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీ యూడబ్ల్యుజే ఉప ప్రధాన కార్యదర్శి కే జయరాజు, కార్యవర్గ సభ్యులు ఎస్‌కే బాబు, పీ నాగమల్లేశ్వరరావు, కృష్ణా అర్భన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జీ రామారావు, దారం వెంకటేశ్వ రరావు, ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి బీ విలియం పాల్‌, యూనియన్‌ నాయకులు నిమ్మరాజు చలపతిరావు, చావా రవి, సీహెచ్‌ రమణారెడ్డి, దాసరి నాగరాజు, తదితరులు తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పుల్లయ్య మృతి యూనియన్‌కు తీరని లోటని పేర్కొంటూ ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు.

పుల్లయ్య మృతికి ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టుల ఫోరం ఒక ప్రకటనలో విచారణ వ్యక్తం చేసింది. పుల్లయ్య మృతికి ఏపీజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరామ్‌యాదవ్‌, డీ దయాకర్‌ తదితరులు సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు. చిన్నపత్రికల అభివృద్ధికి పుల్లయ్య విశేషంగా కృషిచేశారని సంతాప ప్రకటనలో వారు పేర్కొన్నారు.

ముత్యాల ప్రసాద్‌ సంతాపం

సీనియర్‌ పాత్రికేయుడు ఉదయగిరి పుల్లయ్య మృతి పత్రికారంగానికి తీరని లోటని విశాలాంధ్ర పత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్‌ సంపాదకవర్గం తరఫున సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పుల్లయ్య సబ్‌ ఎడిటర్‌గా విశాలాంధ్రలో దశాబ్దన్నర కాలం అంకితభావంతో సేవలందించారని ప్రసాద్‌ గుర్తు చేశారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు