విజయవాడలో సి.పి.ఐ నూతన కార్యాలయానికి 'దాసరి నాగభూషణరావు భవన్‌' గా నామకరణం

Thu, 26 Apr 2012, IST    vv

విజయవాడ (వి.వి) : విజయవాడ నగరంలోని హనుమాన్‌పేటలో నిర్మితమవుతున్న ఐదు అంతస్థుల నగర, జిల్లా సమితి నూతన కార్యాలయ భవనానికి అమరజీవి దాసరి నాగభూషణరావు భవన్‌గా నామకరణం చేయాలని సి.పి.ఐ విజయవాడ నగర కార్యదర్శివర్గం నిర్ణయించింది. సి.పి.ఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ అధ్యక్షతన గురువారం జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సుబ్బరాజు, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌ జాతీయ సమితి కార్యదర్శిగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహిం చిన దాసరి, పార్టీలో దిగవల్లి గ్రామ కార్యదర్శి నుండి అంచెలంచెలుగా ఎదిగి నూజివీడు తాలూకా పార్టీ కార్యదర్శిగా, కృష్ణాజిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సమితి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా పార్టీకి, ప్రజలకు విశేష సేవలందించారు.పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారికి భూపంపిణీ కోసం అనేక భూపోరా టాలు నిర్వహించిన భూపోరాటయోధుడు దాసరి పేరు స్ఫూర్తిదాయకంగా వుంటుందని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే సమావేశ మందిరానికి (హాలు) నగర కమ్యూనిస్టు సమితి ఉద్యమ నిర్మాత తమ్మిన పోతరాజు పేరు పెట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో సి.పి.ఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా సూర్యారావు, సమితి సహాయ కార్యదర్శి పి.దుర్గా భవాని, కార్యదర్శివర్గ సభ్యులు వియ్యపు నాగేశ్వర రావు, చలసాని అజరు కుమార్‌, టి.వి.రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు