సైనాకు రియో బెర్త్‌ గల్లంతు

Sat, 30 Apr 2016, IST    vv
సైనాకు రియో బెర్త్‌ గల్లంతు

వూహాన్‌ : రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ స్థానం గల్లంతైంది. చైనాలోని వూహాన్‌లో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సెమీ ఫైనల్లో సైనా ఓటమిపాలైంది. చైనాకు చెందిన వాంగ్‌ ఇహాన్‌ చేతిలో వరుస సెట్లలో 16-21, 14-21 తేడాతో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. వూహాన్‌ క్రీడా కేంద్రంలో 41 నిమిషాల పాటు సాగిన పోరులో ఇహాన్‌ వేగవంతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. 2015 ప్రపంచ చాంపియన్‌ రన్నపర్‌ అయిన 26 ఏళ్ల సైనా, 2011 ప్రపంచ చాంపియన్‌, 2012 రజత పతక గ్రహీత అయిన ఇహాన్‌లు 15సార్లు తలపడ్డారు. అందులో సైనాకు ఇది 11వ ఓటమి. ప్రపంచస్థాయిలో 8వ ర్యాంకులో ఉన్న సైనా వూహాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9-6తో ముందున్నప్పటికీ ఆ తరువాత 10-10తో సమం చేసిన ఇహాన్‌ విజయం సాధించింది. తరువాతి సెట్‌లో గట్టిగా నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇహాన్‌ విజయాన్ని ఆపలేకపోయింది. కాగా, ఆదివారం వాంగ్‌ ఇహాన్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ లి గ్జరైతో తలపడనుంది. వీరిద్దరూ ముఖాముఖి మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు చెరో 9 గేమ్‌లు గెలిచి మూడో ఆసియా చాంపియన్‌ టైటిల్‌ సాధించేందుకు సిద్ధమయ్యారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు