పంజాబ్‌ కెప్టెన్‌గా మురళీవిజరు

Sat, 30 Apr 2016, IST    vv
పంజాబ్‌ కెప్టెన్‌గా మురళీవిజరు

ఢిల్లీ : ఐపీఎల్‌ 9వ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములు ఎదుర్కొన్న కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా మురళీ విజరును నియమించారు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ మిల్లర్‌ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని ప్రాంఛైజీ నిర్వాహ కులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. మిల్లర్‌ బలమైన ఆటగాడని పేర్కొన్నారు. ఐపీఎల్‌ 2016 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ మురళీ విజరు పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరి స్తాడు. ఈ సీజన్‌లో జట్టు క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో పంజాబ్‌ చివరి స్థానంలో ఉంది. ధోని నాయకత్వంలోని పూనె రైజింగ్‌ సూపర్‌ జెయింట్స్‌పై ఒక విజయాన్ని మాత్రం సాధించగలిగింది. టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో మిల్లర్‌ 76 పరుగులు మాత్రమే సాధించి 15.20 సగటుతో ఉన్నాడు. మురళీ విజరు 143 పరుగులతో 23 సగటు కలిగి ఉన్నాడు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు