సామాజిక చైతన్యమే 'అరసం' ధ్యేయం

Sat, 30 Apr 2016, IST    vv
సామాజిక చైతన్యమే 'అరసం' ధ్యేయం

విశాలాంధ్ర-తిరుపతి : సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి, సామాజిక చైతన్యమే ధ్యేయంగా అరసం పనిచేస్తోందని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెను గొండ లకీëనారాయణ, అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాచ పాళెం చంద్రశేఖర్‌రెడ్డి ప్రభృతులు అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 80 వసంతాలను పురస్కరిం చుకొని రెండు రోజుల పాటు జరిగే '' కథల బడి'' శనివారం ఉదయం ఇక్కడి వరదరాజనగర్‌లోని '' మధురాంతకం రాజా రాం కథా ప్రాంగణం'' (జేసీఆర్‌ చైతన్య స్కూల్‌)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సభకు అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిధిగా పెనుగొండ లకీë నారాయణ మాట్లాడుతూ సాహిత్యాభివృద్ధి, సమాజాభివృద్ధికి అరసం చేసిన కృషి మరువలేనిదన్నారు. అరసంలో శ్రీశ్రీ పాత్ర మరువలేనిదన్నారు. మార్క్సిస్టు దృక్పథంతో నవలలు, కథలు తీసుకురావడానికి అరసం విశేషంగా కృషి చేసింద న్నారు. తెలుగు కథా ప్రస్తానంలో రాయలసీమ, చిత్తూరు జిల్లాల్లో ప్రాంతీయ దృక్పథంతో వస్తున్న రచనలను ఆయన అభినందించారు. చదవరులు, పాఠకులు రచయితలు కావా లని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాత్వికదృక్పథంతో సామాజిక దృష్టి, నిబద్ధతతో సమాజాన్ని అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అరసం భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యనిస్తూ రచనలు తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అరసం జాతీయ మహాసభలను సెప్టెంబరులో ఉత్తరాఖండ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచ పాళెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రచయితలు కాలక్షేపం, పురస్కారాల కోసం కాకుండా సమసమాజనిర్మాణం కోసం, సామాజిక సమస్యల పరిష్కారం కోసం, ప్రజాచైతన్యం కల్గించే రచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశ్రీ, కొ.కు. తదితర మహామహుల చేతుల్లో పురుడు పోసుకున్న అరసం 80 వసంతాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిబద్ధతతో ముందుకెళుతోందన్నారు. అరసం ఏర్పడక ముందు కందుకూరి వంటి వారు అభ్యుదయ భావజాలంతో రచనలు చేసినప్పటికీ, అరసం ఏర్పడ్డాక వచ్చిన రచనలను విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లినట్లు తెలిపారు.

గతంలో అరసం ఆధ్వర్యంలో నిర్వహించిన 'కథలబడి'కి సంబంధించి ప్రఖ్యాత రచయితల ఉపన్యాసాలను క్రోడీకరించిన కథానిక పాఠాల పుస్తకాన్ని చిలకూరి దేవబ్రద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్‌ రాసాని, కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరనాథరెడ్డి, ప్రముఖ రచయిత సుంకోజీ దేవేంద్రాచారి ప్రసంగించారు. అనంతరం 'కథానిక శిల్పం' అనే అంశంపై డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, కథా రచన-వాస్తవికత, కల్పన అనే అంశంపై శ్రీకాకుళానికి చెందిన అట్టాడ అప్పలనాయుడు, నేను రాసిన కథ- నా అనుభవంపై సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి బోధించారు. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాకం నాగరాజ, విశాలాంధ్ర జనరల్‌ మేనేజర్‌ పుట్టా హరినాథరెడ్డి, అరసం జిల్లా అధ్యక్షకార్యదర్శులు గంటా మోహన్‌, యువశ్రీ మురళి, ఔత్సాహిక రచయితలు తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

రాష్ట్ర వార్తలు లో మరికొన్ని

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు